Home » Alludu Seenu,Bellamkonda Sreenivaas,moviereviews,news,Reviews,samantha » Alludu Srinu Movie Review – Telugu

Alludu Srinu Movie Review – Telugu


Alludu Srinu Samantha HOT HD

Click Here for Alludu Srinu movie all latest updates

Theater watched : Leelamahal center , Bheemavaram

 

Alludu Srinu Movie Review in Telugu

 

  • Masthan : రేయ్ బిట్టు , ఎక్కడికి మాంచి జోష్ మీద వెళ్తున్నావ్ . ? 
  • Bittu : అల్లుడు శ్రీను అని మూవీ రిలీజ్ అయ్యింది ,చూద్దామని . నువ్వు కూడా వస్తావా . ?
  • Masthan : అల్లుడు శ్రీను నా . ? , ఎవరందులో హీరో మహేష్ బాబా . ? , పవన్ కళ్యాణా . ?
  • Bittu : బెల్లంకొండ శ్రీనివాస్ అని ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ ఉన్నాడు చూడు ఆయన కొడుకు .
  • Masthan : ఓహో మరి నువ్వెందుకు ఎదో పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ హిట్ మూవీ వచ్చినంత హడావిడి గా వెళ్తున్నావ్ . ?
  • Bittu : నేనంతే ఏదన్నా కొత్త సినిమా వస్తే మొదటి రోజు చూసేయ్యకపోతే నాకు నిద్రపట్టదు . అయినా డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నావ్ . . . , మన V .V . వినాయక్
  • Masthan : ఏదీ కామెడీ తో కితకితలు పెట్టే , voilence తో వీణ వాయించే మన వినాయక్ అన్నా . ?
  • Bittu : హా అవును , దానికి తోడు మన regressive పాప సమంతా కూడా ఉంది ..
  • Masthan : సరే ఐతే పదా వెళ్దాం . . ,
  • Bittu : ఏరా , సమంతా అనగానే గంట కొట్టిందా ఏంటి .. ? , మారు మాట్లాడకుండా పద వెళ్దాం అంటున్నావ్ . ?

కట్ చేస్తే సినిమా ధియేటర్ దగ్గర టికెట్స్ తీసుకుంటూ . .

 

  • Masthan : ఏరా అసలకి సినిమా టాక్ ఏంటి . ?
  • Bittu : హిట్ అంట మరి ప్రీమియర్ show టాక్ లో విన్నాను .. ! అయినా తినబోతూ రుచి అడిగినట్లు సినిమా చూడబోతు రివ్యూస్ గురించి ఎందుకు రా . టికెట్స్ తీస్కో షో టైం అయ్యింది వెళ్దాం .

సినిమా స్టార్ట్ అయ్యింది …..

 

  • Masthan : రేయ్ బిట్టు హీరో ఎంట్రన్స్ అదిరింది కదా . . ?
  • Bittu : ఇంకెన్ని సినిమాల్లో చూపిస్తారు రా అలాగా … , అయినా కబడ్డీ ఆడటానికి గాల్లో నుంచి కిందకి దిగటం అవసరమా రా .. మామూలు గా రావచ్చు గా …
  • Masthan : ఊర్కో రా మాస్ ఆడియన్స్ పల్స్ నీకేం తెలుసు రా . , ఆ మాత్రం ఉంటేనే హీరోయిజం తెలిసేది మరి .!
  • Bittu : నిజమే రా నాకు మాస్ ఆడియన్స్ పల్స్ తెలియక పోవచ్చు కాని కామన్ ఆడియన్ పల్స్ మాత్రం తెలుసు రా  ..!
  • Masthan : shhhpp కెవ్వు … సూపర్ ….
  • Bittu : నువ్వేమైనా బెల్లంకొండ శ్రీనివాస్ స్టేట్ ఫాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఆ లేక హార్డ్ కోర్ ఫ్యాన్ వా . ? అంత ఏం నచ్చింది రా నీకు అందులో . . .
  • Masthan : ఏమో రా అందరూ అరుస్తున్నారు ..అందుకే నేను అరుస్తున్నాను …. ఫస్ట్ రోజు ఫస్ట్ షో చూసేటప్పుడు ఈ మాత్రం హడావిడి లేకపోతే ఎలా రా చెప్పు …
  • Bittu : సరే కానీ …
  • Masthan : అరేయ్ ఈ సీన్ లు ఈ కామెడీ ఎక్కడో చూసినట్లు ఉన్నాయ్ రా …
  • Bittu : నువ్వేం కంగారు పడకు క్లైమాక్స్ కి వచ్చే సరికి ఒక క్లారిటీ ఇచ్చేస్తారు లే ..
  • Masthan : అరేయ్ bittu …. తమన్నా తో అంత పెద్ద సెట్ వేసి ఐటెం సాంగ్ పెట్టే బదులు ఆ బడ్జెట్ తో రామ్ గోపాల్ వర్మ , రవి బాబు లాంటి వాళ్ళు ఒక మూవీ చేసేస్తారు కదరా
  • Bittu : ఆయనకి ఉన్నాయ్ ఆయన పెడతాడు మద్యలో నికేంటంటా . ?
  • Masthan : అది సర్లే గాని ఇందాక డైరెక్టర్ వినాయక్ అన్నావ్ .., ఇది చూస్తేనేమో శ్రీను వైట్ల మూవీ లా ఉంది ..
  • Bittu : అంటే శ్రీను వైట్ల దగ్గర పని చేసే రైటర్స్ కోన వెంకట్ , గోపి మోహన్ ఆయన దగ్గర్నుంచి బయటకొచ్చేసి ఈ మూవీ కి వర్క్ చేసారు లే , అందుకే అలా శ్రీను వైట్ల & వినాయక్ మిక్స్డ్ ఫ్లేవర్ స్మెల్ల్ వస్తుంది మూవీ .
  • Masthan : కి కి కికి .. ఒహోహోఒ . . ఏదేమైనా వినాయక్ అన్న కామెడీ లో మాత్రం ఎక్కడా తగ్గడు రా
  • Bittu : అవును లే కామెడీ చేసిందే మళ్లీ మళ్లీ చేసిన నవ్వొస్తుంది కదా అందుకే దానికి మాత్రం ఎక్కడా డోకా లేదు .
  • Masthan : ఊర్కో రా వింటున్నా కదా అని నువ్వు మరీ దారుణం గా చెప్తున్నావ్ ….
  • Bittu : నేను దారుణం గా చెప్తున్నానా . ? అంటే నీకు స్క్రీన్ మీద ఏం కనపడట్లేదా . ?
  • Masthan : బాగానే ఉంది కదా రా . . మాస్ ఉంది క్లాసు ఉంది కామెడీ ఉంది … ఒక తెలుగు హిట్ సినిమా కి కావాల్సిన లక్షణాలన్ని ఉన్నాయ్ కదా …?
  • Bittu : అదే నా బాధ కూడా . , చూసిందే మళ్లీ మళ్లీ టైటిల్ మార్చి ఎన్ని సార్లు చూపిస్తారని ….
ఆ తమ్ముడు ప్రకాష్ రాజ్ . , అన్నయ్య ప్రకాష్ రాజ్ & ఫ్యామిలీ ని చంపే సీన్ నేను నిక్కర్లేసుకున్నప్పుడు సమర సింహారెడ్డి టైం లో చూసా . 20 ఏళ్ల నుంచి తెలుగు సినిమా అక్కడే ఉంది ముందుకు రావట్లా …

 

< – - INTERVAL – - >

 

  • Masthan : హీరో బాగానే చేసాడు కదా రా . ?
  • Bittu : హా బాగానే చేసాడు కాకపోతే మొహం లో Expression ఏ సీన్ లో ఎమోషన్ కి సింక్ అవ్వట్లేదు . కాని చాలా మంది హీరోలతో పోలిస్తే బెటర్ లే , డాన్సు కూడా బాగా చేసాడు కష్టపడ్డాడు …
  • Masthan : హా అది కరెక్టేలే , తనని తను ప్రూవ్ చేసుకోవాలని బాగానే కష్టపడ్డాడు .. !
  • Bittu : సరే సినిమా స్టార్ట్ అయ్యింది పద పోదాం …
  • Masthan : నోట్లో ని సిగరెట్ కింద పడేసి కాలి తో ఆర్పుతూ సరే పదా . . !
2nd Half :

 

  • Bittu : వామ్మో ఏందీ రా ఈ రచ్చ చూడలేక చస్తున్నాం . . నెక్స్ట్ సీన్ ఏం రాబోతుందో మూడు సీన్ ల ముందే తెలిసిపోతుంది …. ఇంక సినిమా చూడటం లో కిక్ ఏముంది నా రొయ్య … !
  • Masthan : ఎవరో హిట్ టాక్ అని రివ్యూ లు పెట్టారు అన్నావ్ …
  • Bittu : వాళ్ళు అలానే పెట్టారు రా మరి . , అందరికీ అన్నీ ఒకేలాగా కన్పించవు కదరా . . ., వాళ్ళకి రైట్ అనిపించింది మనకి రాంగ్ అవుద్ది . . మనకి రైట్ అనిపించింది వాళ్ళకి రాంగ్ అవుద్ది . .
  • Masthan : కాని , సినిమా మరీ ఇంత రొటీన్ గా ఉంటె ఫ్లాప్ అవుద్ది కద రా . ., అలా హిట్ అని రివ్యూస్ లో ఎలా రాసేస్తారు ….
  • Bittu : కొంత మందికి రోజు సాయంత్రం అవ్వగానే రోడ్ చివర ఉండే పునుగుల బండి దగ్గరికి వెళ్లి టిఫిన్ తినటమే ఇష్టం కాని కొంత మందికి రోజుకొక చోట తినటం ఇష్టం . . వాళ్ళకి నచ్చే టిఫిన్ బండి దొరికే దాక అలా తిరుగుతూనే ఉంటారు . ఇది కూడా అలానే వాళ్ళకి అలా రొటీన్ గా కొత్తదనం లేకుండా ఉంటేనే నచ్చుతాయి ఏమో .., వాళ్ళని అలానే రాసుకొని ..!
  • Masthan : హమ్మయ్య క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసాం రా ఇంక కాసేపు ఓపిక పడితే వెళ్లిపోవచ్చు … heavy HEADACHE u know !
  • అరేయ్ అదేంటి రా అలా విల్లన్స్ హీరో & కో ని తగలబెట్టెసారు ఇంక సినిమా ఎట్టా ముందుకు వెల్లుద్ది . ?
  • Bittu : పిచ్చోడ నువ్వు అసలకి తెలుగు ఆడియన్ వేనా . ? మన తెలుగు సినిమా శాస్త్రం ఏం చెప్తుంది … ఎన్ని అడ్డంకులు వచ్చిన హీరో బతికి సినిమా ని క్లైమాక్స్ కి చేర్చి కంప్లీట్ చెయ్యమని చెప్తుంది కదా ..! ఇక్కడ కూడా అదే జరుగుద్ది మరి .. !
  • Masthan : హా అలా ఐతే ఓకే లే .., అలా కాకుండా ఎమన్నా కొత్త గా పెడతారేమో నేను ఇప్పుడు కొత్త గా excitement తో ఎమన్నా చూడాలేమో అని ఆశ్చర్యం వేసింది . !
  • Bittu : హా ఇంక పూర్తి గా క్లైమాక్స్ కి వచ్చేసింది . . అరేయ్ మస్తాన్ గా విల్లన్ గాడు ఇప్పుడు హీరో ని పొడిచాడు కదా ., బతుకుతాడా . ? బతకడా . ? , లేగుస్తాడా . ? లేగవడా . ?
  • Masthan : ఎబ్బే ఈ సారి కష్టం రా .., మరీ దారుణం గా అన్నీ సార్లు పొడిస్తే ఇంకెక్కడ బతుకుతాడు రా !
  • Bittu : అరేయ్ ఎర్రి పుల్కా ఎన్ని సార్లు చెప్పాలి రా నీకు . . మన తెలుగు సినిమా శాస్త్రం ప్రకారం క్లైమాక్స్ లో ఒక ఫైట్ జరగాలి కదా దాని కోసం అయిన వస్తాడు కదరా . ! నీకు మళ్లీ చెప్తున్నా గుర్తుపెట్టుకో 3 అడుగుల సమాధి లో పాతి పెట్టినా సరే క్లైమాక్స్ వచ్చే సరికి ఆరడుగులు పైకి ఎగిరి మరీ బయటకి వచ్చేవాడో తెలుగు సినిమా హీరో ..!
  • Masthan : నీ హడావిడి ఆపుతావా ఇంక . , ?
  • Bittu : ఏ ఎందుకని . ?
  • Masthan : సినిమా అయిపొయింది నువ్వు లెగిస్తే బయల్దేరదాం .!
  • Bittu : అప్పుడే అయ్యిపోయ్యిందా . ? చాలా Racy Screenplay కదరా . !
  • Masthan : నీ బొంద రా . , నీ బొంద . .!
  • ఏదో కూరగాయల బండి మీద ఇది పుచ్చిపోయింది ఇది తీసెయ్ . . ఇది కూడా తీసెయ్ అన్నట్లు మన తెలుగు సినిమా కి వచ్చి ఇది రొటీన్ దే ఈ సీన్ తీసెయ్ . . ఈ సీన్ కూడా తీసెయ్ . . అంటే ఇంక సినిమాలో ఏం మిగుల్తుంది బూడిద . . !
  • Bittu : రేయ్ మస్తాన్ గా సినిమా అయ్యేసరికి నీకు కూడా తెలుగు సినిమా అంటే ento ఒక clarity వచ్చేసింది రా . !
  • Writers BLOCK : అలా హాల్ లో క్యు లో తోపులాటలో నుంచి ఇద్దరూ బయటకొచ్చారు .. !
  • Masthan : అది సరే గాని రా ,, ఇపుడు గాని నువ్వు ఇంటికెళ్ళి సినిమా అలా ఉంది ఇలా ఉంది అని రివ్యూ గట్లా ఎమన్నా పెడతావా ఏందీ మల్లా . ?
  • Bittu : హా మామూల్ గా కాదు ఏకిపడేస్తా ..!
  • Masthan : మనకెందుకు రా బుజ్జి ఈ రివ్యూ లు గట్రా ఏదో చూసామా ,వదిలేసామ అన్నట్లు ఉండక . !
  • Bittu : అందరూ ఇలా ఎవరికీ వాళ్ళు నాకెందుకు అని వదిలేయబట్టే ఎవడిష్టమోచినట్లు వాడు రివ్యూ రాసుకుంటున్నాడు . . ఫ్లాప్ సినిమా కి హిట్ అని రేటింగ్ ఇస్తున్నాడు .దాన్ని నమ్మి ధియేటర్ కి వెళ్ళిన జనాలు రివ్యూ లు రాసే వాళ్ళందర్నీ కలిపి రేవేట్టేస్తున్నారు . . !
  • Masthan : అది కాదు రా RGV లాంటి పెద్ద డైరెక్టర్ ఏ రివ్యూస్ కి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు కద , పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు గా మళ్లీ ఎమన్నా ప్రాబ్లం అవ్తుందేమో అని . .!
  • Bittu : నేను ఎవర్నీ పర్సనల్ గ తిట్టట్లేదు తెలుగు సినిమా స్థాయి పెరగాలి అనుకొనే ఒక సగటు అభిమాని గా నాకెందుకు నచ్చలేదు చెప్తున్నాను అంతే … అందులో తప్పేముంది . !
  • Masthan : సరే గాని ఇంతకీ రేటింగ్ ఎంత ఇద్దామని . ? , ఫైనల్ గా ఏం చెప్దామని . ?

Bittu : రేటింగ్ : 2/5

 

ఫైనల్ గా చెప్పేది ఏంటంటే సినిమా యూనిట్ సేఫ్ సైడ్ ఉండటానికి కామెడీ లేదా కమర్షియల్ సినిమా లు తీసేటప్పుడు కొత్తవి తియ్యకపోయ్యినా కనీసం కొత్తగా చూపించటానికి అయిన ట్రై చెయ్యండి . , ఇన్నాళ్ళు చూస్తూనే వచ్చాం గా , , లేదంటే కొత్త సినిమాలు చెయ్యండి అవి హిట్ అయిన ఫ్లాప్ అయిన కొత్తదనం తెచ్చిన సినిమాలు గా ఎప్పటికీ చరిత్ర లో అలా మిగిలిపోతాయి . RGV గారు చెప్పినట్లు డబ్బులు ఎక్కడికీ పోవు సర్ మీరు కొత్తగా ట్రై చేస్తూనే ఉండండి ఏదోక రోజు అవే మీ దగ్గరికి వస్తాయి . అంతే గాని రెగ్యులర్ రొటీన్ సినిమా తీసేసి నెగటివ్ రివ్యూస్ వస్తే . ., ఆ రివ్యూస్ వల్ల సినిమా కలెక్షన్స్ తగ్గిపోయ్యాయి వాళ్ళకి రివ్యూ రాయటం చేతకాదు . , ఆడియన్సు కి సినిమా చూడటం చేతకాలేదు , అర్ధం చేసుకునేంత maturity లేదు లాంటి కామెంట్స్ చెయ్యకండి .అదే ఆడియన్సు సినిమాల్ని 150 , 200 రోజులు ఆడించారని గుర్తుంచుకోండి . . అయినా సగటు ప్రేక్షకుడికి సినిమా అర్ధమయ్యేలా తియ్యటం ఫిలిం మేకర్ బాద్యత .

 

అల్లుడు శ్రీను - ఓరి దేవుడో రొటీన్ సీను ( Typical Routine Commercial Telugu Cinema )

 

బహుశా మేము సినిమా హాల్ లో మాట్లాడుకుంటూనే ఉండటం వల్ల సినిమా ఎక్కలేదేమో . . .మీకు ఎక్కోచ్చేమో ఒకసారి చూసి ఎలా ఉందో ఇక్కడ కామెంట్ ఎస్కోండి . !

Incoming Searc terms : Alludu Srinu movie reviews , alludu seenu review , alludu sreenu telugu film rating , alludu srinu movie strikingsoon review , alludu srinu movie genune review , alludu srinu funny review , telugu film alludu srinu review and rating , alludu srinu telugu review , alludu srinu movie review in telugu .

Review In A Glance
  • Direction & Screenplay
    2
  • Story
    1.5
  • Performance
    2.5
  • Music
    3

Bellamkonda Srinivas and Samantha starring Alludu Srinu telugu movie exclusive review in a unique way by strikingsoon.com

2
Typical Routine Commercial Telugu Cinema